ఏపీ అసెంబ్లీలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌పై సీఎం చంద్రబాబు ప్రశంసలు కురిపించారు. రెండో రోజు శాసనసభ సమావేశాల్లో ఆయన మాట్లాడారు. పవన్‌ను అసెంబ్లీ గేటు కూడా తాకనీయమని గత ప్రభుత్వ నేతలు విమర్శించారు. ఇవాళ 21 సీట్లలో పోటీ చేసి అన్ని స్థానాల్లో గెలిపించిన వ్యక్తి పవన్. ఎక్కడ తగ్గాలో.. ఎక్కడ గెలవాలో తెలిసిన వ్యక్తి పవన్ అని చంద్రబాబు తెలిపారు.