టాయిలెట్స్‌లో ఫ్లష్‌ బటన్లు రెండు ఎందుకు ఉంటాయో తెలుసా?

విదేశాల్లో మాత్రమే వాడే వెస్ట్రన్ టాయిలెట్లు ఇప్పుడు మన దేశంలోనూ ఉపయోగిస్తున్నారు. అయితే దీని ఫ్లష్‌కు 2 బటన్‌లు ఉండటాన్ని గమనించే ఉంటారు. అసలు ఇలా ఎందుకు ఉంటాయంటే..ఈ ఫ్లష్ ను ఉపయోగించి మలవిసర్జన చేసినప్పుడు పెద్ద బటన్‌ను ప్రెస్‌ చేయాలి. మూత్ర విసర్జనకు చిన్న బటన్‌ను ఫ్లష్‌ చేయాలి. ఫలితంగా నీరు ఆదా అవుతుంది. ఇందులో పెద్ద బటన్‌ను ఫ్లష్‌ చేస్తే 6-7 లీ. నీరు, చిన్న బటన్‌ను నొక్కితే 3-4 లీ. నీరు బయటకు వస్తుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్