అమెరికాలో శాశ్వత నివాస హక్కును కల్పించే ‘గ్రీన్ కార్డు’ కోసం అక్కడి భారతీయ వృత్తి నిపుణులు దశాబ్దాలుగా ఎదురుచూస్తున్నారు. గ్రీన్ కార్డ్ బ్యాక్లాగ్స్లో భారతీయుల సంఖ్య 2023 నవంబర్ 2 నాటికి 12,59,443కు చేరుకున్నది. అమెరికా పౌరసత్వం, వలస సేవల విభాగం (USCIS) డాటాను విశ్లేషించిన నేషనల్ ఫౌండేషన్ ఫర్ అమెరికన్ పాలసీ (NFAP) తాజా గణాంకాల్ని విడుదల చేసింది.