ఎగిరిపడి బైకర్ స్పాట్‌డెడ్ (వీడియో)

610చూసినవారు
కేరళలోని కొచ్చి నగరంలో విషాద ఘటన జరిగింది. ప్రధాని మోడీ పర్యటన సందర్భంగా పోలీసులు పలు రోడ్లపై రాకపోకలను నియంత్రించారు. ఈ క్రమంలో ఆదివారం రాత్రి వళంజంబలం జంక్షన్ వద్ద రోడ్డుకు అడ్డంగా తాడు కట్టారు. ఆ సమయంలో మనోజ్ ఉన్ని అనే యువకుడు వేగంగా బైక్‌పై వచ్చాడు. అయితే తాడు తగిలి బైక్‌పై నుంచి కింద పడ్డాడు. తీవ్రగాయాలపాలై స్పాట్‌లోనే చనిపోయాడు. పోలీసుల వల్లే మనోజ్ చనిపోయాడని అతడి కుటుంబ సభ్యులు ఆరోపించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్