టీ20 ప్రపంచకప్లో ఉగాండా తరపున ఆడుతున్న జుమా మియాగి గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిందే. ఉగాండా రాజధాని కంపాలా శివారులోని నాగురు మురికివాడకు చెందిన 21 ఏళ్ల మియాగి ఇప్పటివరకూ 21 అంతర్జాతీయ టీ20ల్లో 34 వికెట్లు పడగొట్టాడు. ఇప్పటికీ కుటుంబంతో కలిసి అతడు మురికివాడల్లోనే ఉంటున్నాడు. ప్రపంచకప్లో ఉగాండా తమ తొలి మ్యాచ్ను సోమవారం అఫ్గానిస్థాన్తో ఆడుతుంది.