రుణమాఫీ పథకానికీ నిధుల కొరత

కొత్తగా రుణాలు తీసుకుంటున్నా కిస్తీల చెల్లింపుల భారం వల్ల ప్రభుత్వం వద్ద మిగులు నిధులు ఉండటం లేదు. వచ్చే ఆగస్టు 15లోగా రుణమాఫీ పథకానికి కనీసం రూ.30 వేల కోట్ల నుంచి 35 వేల కోట్లను బ్యాంకులకు రాష్ట్ర ప్రభుత్వం రైతుల తరపున చెల్లించాల్సి ఉంది. ఈ నిధులు సొంతంగా సమకూర్చుకునే అవకాశాలు లేవని, రుణాలుగా తీసుకోవాల్సిందేనని ప్రభుత్వ పరిశీలనలో తేలింది. ఇందుకుగాను బాండ్లను విక్రయించాలా.. భూములను తాకట్టు పెట్టాలా.. ప్రత్యేక కార్పొరేషన్‌ ఏర్పాటుచేసి ప్రభుత్వ గ్యారంటీతో అప్పులు తీసుకునే అవకాశాలున్నాయా.. అనే అంశాలను పరిశీలిస్తోంది.

సంబంధిత పోస్ట్