తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణలో ఉన్నటువంటి రజక కులస్తులకు 102 జీవో అమలు చేయడం పై జిల్లా రజక సంఘం అధ్యక్షులు సంగు స్వామి హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ రజక కులస్తుల సంక్షేమం కొరకై ముఖ్యమంత్రి కేసీఆర్ 102 జీవోను అమలు చేయడం జరిగిందని. ఈ జీవో ద్వారా ప్రభుత్వ సంస్థలలో ప్రభుత్వ ఆసుపత్రులు, గురుకుల పాఠశాల రెసిడెన్షియల్ స్కూల్ వాషింగ్ సంబంధించి కేవలం రజక సొసైటీలకె ఇవ్వాలని ఉద్దేశంతో ముఖ్యమంత్రి కెసిఆర్ 102 జీవో ను రజక కులస్తులకు కేటాయించినందుకు తెలంగాణ రాష్ట్ర రజక సంఘం కులస్తుల రుణపడి ఉంటామని తెలిపారు. గత ప్రభుత్వాలు రజకుల స్థితిగతులను ఆలోచించలేదని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వమే రజకులను గుర్తించి102 జీవోను అమలు చేసిందన్నారు. అదేవిధంగా రజక సోదర సంక్షేమం కొరకై లక్ష రూపాయల రుణాలను అందిస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి, కి రజక కులస్తులు ఎల్లవేళలా రుణపడి ఉంటారని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ నాయకులుఅబ్దుల్ అజీజ్, రెడ్డి శెట్టి రవీందర్, ఆకుల మహేష్, రంజిత్ గౌడ్, నరేందర్ నాయక్, లక్ష్మణ్, తదితరులు పాల్గొన్నారు.