కడ్తాల్ మండల కేంద్రానికి చెందిన రేషన్ డీలర్ మహమ్మద్ అన్వర్ మూడు రోజుల క్రితం మృతి చెందాడు. ఆదివారం రేషన్ డీలర్ల సంఘం నాయకులు మృతునికి నివాళులర్పించారు. అనంతరం మృతుని కుటుంబానికి పదివేల రూపాయల ఆర్థిక సహాయం అందజేసి కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. సంఘం మండల అధ్యక్షురాలు సుజాత మల్లేష్ గౌడ్, నాయకులు సత్యనారాయణ, బిచ్చ నాయక్, జంగయ్య, లక్ష్మయ్య, సుధాకర్ రెడ్డి, చంద్రశేఖర్, దశరథ్ పాల్గొన్నారు.