నేడు సింగూరు నీటి విడుదల

పుల్కల్ మండలం సింగూరు లోని ప్రాజెక్టులో పూర్తిస్థాయి నీటిమట్టం పెరిగినందున గురువారం ఉదయం 9 గంటలకు గేట్ల ద్వారా నీటిని విడుదల చేస్తామని అధికారి మహిపాల్ రెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. భారీ వర్షాల వల్ల ఉదయం 6 గంటల వరకు 45 వేల క్యూసెక్కుల ఇన్ ఫ్లో నీరు ప్రాజెక్టులోకి చేరిందని చెప్పారు. నీటిని విడుదల చేస్తున్నందున లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు.

సంబంధిత పోస్ట్