కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ అధ్యక్షురాలిగా సోనియా

కాంగ్రెస్ లోక్‌సభ, రాజ్యసభ ఎంపీల సమావేశంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఢిల్లీలోని పార్లమెంట్ సెంట్రల్ హాల్‌లో శనివారం నిర్వహించిన సమావేశంలో పార్టీ పార్లమెంటరీ అధ్యక్షురాలిగా సోనియా గాంధీని ఎన్నుకున్నారు. సోనియా గాంధీ ప్రస్తుతం రాజ్యసభ ఎంపీగా ఉన్నారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే సోనియా పేరును ప్రతిపాదించారు. పార్టీ ఎంపీలు తారిఖ్ అన్వర్, గౌరవ్ గొగోయ్ తదితరులు బలపరిచారు.

సంబంధిత పోస్ట్