గొంతులో సమస్యతో చిరాకుగా ఉందా..?

66చూసినవారు
గొంతులో సమస్యతో చిరాకుగా ఉందా..?
ప్రతి ఒక్కరికి ఏదో ఒక సమయంలో గొంతు స‌మ‌స్య వస్తునే ఉంటుంది. అయితే ఈ సమస్య ఉన్నవారు ఒక పాత్రలో పావు లీటరు నీళ్లు పోసి పొయ్యి మీద పెట్టాలి. ఆ నీళ్లలో చిన్న అల్లం ముక్క, రెండు యాలకులు, 10 లేదా 12 తులసి ఆకులు, పావు స్పూన్ పసుపు వేసి బాగా మరిగించాలి. అలా మరిగించిన నీటిని వడకట్టి ఒక స్పూన్ తేనె కలుపుకొని తాగాలి. అయితే, మధుమేహం ఉన్నవాళ్లు మాత్రం తేనె కలుపకూడదు. ఈ చిట్కా పాటిస్తే క్షణాల్లోనే ఈ సమస్య పోతుందని నిపుణులు సూచిస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్