టీ20 వరల్డ్ కప్ 2024లో టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఆశించిన స్థాయిలో రాణించలేకపోతున్నాడు. ఇప్పటివరకు ఆరు మ్యాచ్‌లు ఆడిన అతడు ఓపెనర్‌గా వచ్చి వరుసగా 1, 4, 0, 24, 37, 0 చొప్పున పరుగులు చేశాడు. దీంతో విరాట్ ప్రదర్శనపై టీమిండియా మాజీ దిగ్గజం సునీల్ గవాస్కర్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. అతడు ఔట్ అయిన షాట్లను గమనిస్తే ఇది స్పష్టమవుతోందని అన్నారు. ఆంటిగ్వాలో బంగ్లాదేశ్‌పై మ్యాచ్‌లో కోహ్లీ బ్యాలెన్స్ సరిగ్గా లేదని అన్నారు.