T20 WC: ఇంగ్లాండ్ లక్ష్యం 116 రన్స్

T20 ప్రపంచకప్ సూపర్-8లో భాగంగా నేడు ఇంగ్లాండ్, అమెరికా మధ్య మ్యాచ్ జరుగుతోంది. తొలుత బ్యాటింగ్ చేసిన అమెరికా 115 పరుగులకు ఆలౌట్ అయ్యింది. నితీశ్ కుమార్ (30), అండర్సన్ (29), హర్మిత్ సింగ్ (21) పరుగులు చేశారు. ఇంగ్లాండ్ బౌలర్లలో జోర్డాన్ 4, శ్యామ్ కర్రన్, రషీద్ 2 చొప్పున, లివింగ్టన్, టాప్లీ 1 చొప్పున వికెట్లు తీశారు. ఇంగ్లాండ్ లక్ష్యం 116 పరుగులు.

సంబంధిత పోస్ట్