ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఓ వీడియో గురువు, విద్యార్థుల మధ్య ఉండాల్సిన బంధం గురించి వెల్లడించింది. ఈ వీడియోలో ఓ టీచర్ బర్త్‌డేకు స్కూలు విద్యార్థినులు సర్ప్రైజ్ ప్లాన్ చేశారు. ఆ టీచర్ క్లాస్‌లోకి వస్తూ కెమెరా చూసి సిగ్గుపడి బయటకు వెళ్లిపోయారు. విద్యార్థులు బతిమాలిన తర్వాత లోపలికి వచ్చారు. ఓ స్టూడెంట్ ఆమెకు గిఫ్ట్ ఇచ్చారు. అది ఓపెన్ చేసి చూసి ఆ టీచర్ కన్నీళ్లు పెట్టుకున్నారు.