యూజీసీ-నెట్ పరీక్షను రద్దు చేయడానికి కారణం ఇదే!

75చూసినవారు
యూజీసీ-నెట్ పరీక్షను రద్దు చేయడానికి కారణం ఇదే!
యూజీసీ-నెట్‌ పరీక్ష జరిగిన మరుసటిరోజు జూన్ 19న నేషనల్ సైబర్ క్రైమ్ త్రెట్ ఎనలిటిక్స్ యూనిట్ నుంచి యూజీసీకు ఒక సమాచారం అందింది. యూజీసీ-నెట్‌ పరీక్షల నిర్వహణలో అవకతవకలు జరిగాయనడానికి ప్రాథమిక ఆధారాలు ఉన్నాయనేది ఆ సమాచార సారాంశం. దీంతో నెట్ పరీక్షను రద్దు చేసినట్టు కేంద్రం తెలిపింది. సమగ్ర దర్యాప్తు కోసం ఈ కేసును సీబీఐకు అప్పగిస్తున్నట్టు ప్రభుత్వం తెలిపింది.

సంబంధిత పోస్ట్