మా ఉద్యోగాలు మాకివ్వండి: మాజీ వాలంటీర్లు

64చూసినవారు
మా ఉద్యోగాలు మాకివ్వండి: మాజీ వాలంటీర్లు
ఎన్నికలకు ముందు రాజీనామా చేసిన వాలంటీర్లు ఇప్పుడు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. తాజాగా మచిలీపట్నం పరిధిలో వాలంటీర్లు తమ ఉద్యోగాలు తమకు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. తమని తిరిగి విధుల్లోకి తీసుకోవాలని కోరుతున్నారు. ఈ మేరకు కమిషనర్ బాపిరాజుకు విజ్ఞప్తి చేశారు. వాలంటీర్లు అంతా కలిసి విజ్ఞాపన పత్రాలను అందజేశారు. ఈ వినతులను ప్రభుత్వానికి సమర్పిస్తామని కమిషనర్ తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్