కవచ్ అమలవుతున్న రాష్ట్రాల జాబితా ఇదే.!

రైళ్లలో ప్రయాణికుల భద్రత కోసం ఇండియన్ రైల్వేస్ ‘కవచ్’ను అందుబాటులోకి తెచ్చింది. కవచ్ అనేది రైల్వే రక్షణ వ్యవస్థ. ఒకే ట్రాక్‌పై రెండు రైళ్లు ప్రయాణించకుండా ఆపగలుగుతుంది. అయితే కవచ్ దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలలో అమలు కావడం లేదు. తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో కవచ్ అమలవుతోంది. ప్రస్తుతం నార్తర్న్, నార్త్ సెంట్రల్, ఈస్టర్న్, ఈస్ట్ సెంట్రల్, వెస్టర్న్, వెస్ట్ సెంట్రల్ పరిధిలో కవచ్ పనులు జరుగుతున్నాయి.

సంబంధిత పోస్ట్