నాడు ఏమైంది.. ఇప్పుడు సుద్దపూస మాటలు మాట్లాడుతున్నారు: సీతక్క

జనవరి 26న అమలు చేసే పథకాలు అంతా డొల్లని, అసలు పథకాలు ఎవరికీ వర్తించే పరిస్థితులు లేవంటూ BRS నేత హరీశ్ రావు చేసిన వ్యాఖ్యలపై మంత్రి సీతక్క భగ్గుమన్నారు. 'అధికారంలో ఉన్నప్పుడు కూలీల‌కు ఏకాన ఇవ్వకుండా ఇప్పుడు డిమాండ్లు వినిపిస్తున్నారు. కోటీశ్వరుల‌కు కొమ్ము కాసి క‌ష్టజీవుల‌ను విస్మరించారు. నాడు ఏమయ్యాయి మీ మాటలు? ఇప్పుడు ఏదో సుద్దపూస మాటలు మాట్లాడుతున్నారు. అర్హులైన ఉపాధి కూలీ కుటుంబాల‌కు ఆత్మీయ భ‌రోసా ఇస్తాం' అని అన్నారు.

సంబంధిత పోస్ట్