AP: చిత్తూరు జిల్లాలో కలకలం రేగింది. మెదవాడ అటవీ ప్రాంతానికి కొందరు గుర్తుతెలియని దుండగులు నిప్పు పెట్టారు. 100 హెక్టార్లలో ఎర్రచందనం చెట్లు అగ్నికి ఆహుతి అయినట్లు ఫైర్ అధికారులు తెలిపారు. దీంతో, సమీప గ్రామస్తులు భయాందోళనకు గురవుతున్నారు. ఇంత జరుగుతున్న అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు మండిపడుతున్నారు.