ఏపీలో 205 కేజీల గంజాయి స్వాధీనం (వీడియో)

80చూసినవారు
ఒడిశా నుంచి ఏపీలోని నర్సీపట్నంకు అక్రమంగా రవాణా చేస్తున్న 205 కేజీల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నెల్లిమెట్ట గ్రామం వద్ద కారును ఆపిన నర్సీపట్నం రూరల్ పోలీసులు నిందితుల నుంచి రూ.10.25 లక్షల గంజాయితో పాటు ఒక కియా కారు, మరో మోటర్ సైకిల్‌ను సీజ్ చేశారు. కేరళకు చెందిన నిందితులు యాప్‌లో కియా కారును అద్దెకు తీసుకుని మీడియా సంస్థ లోగోను తగిలించి స్మగ్లింగ్‌కు పాల్పడ్డారని పోలీసులు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్