కడప జిల్లాలో 21మంది రౌడీషీటర్లు బహిష్కరణ

579చూసినవారు
కడప జిల్లాలో 21మంది రౌడీషీటర్లు బహిష్కరణ
కడప జిల్లాలో 21మంది రౌడీషీటర్లపై జిల్లా బహిష్కరణ చేసిన‌ట్లు పోలీస్ అధికారులు తెలిపారు. జిల్లాలో మొత్తం 1038 మంది రౌడీషీటర్లు ఉన్నారు. వారిలో 652 మంది రౌడీషీటర్లను ముంద‌స్తు అరెస్ట్ చేసిన‌ట్లు పేర్కొన్నారు. 131 మంది గృహనిర్బంధం చేశారు. మిగిలిన వారు సొంత ఊరు వదిలి ఎక్కడా తిరగకూడదంటూ నోటీసులు జారీచేశారు. ఈరోజు సాయంత్రం ఐదు గంట‌ల నుంచి ఆదేశాలు అమలు కానున్నాయ‌ని, జూన్ 7 వ‌ర‌కు ఆదేశాలు అమ‌లులో ఉంటాయ‌ని పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్