'పుష్ప-2' బ్యాక్‌గ్రౌండ్‌ మ్యూజిక్‌.. పారితోషికం కూడా వద్దన్నా: తమన్‌

62చూసినవారు
'పుష్ప-2' బ్యాక్‌గ్రౌండ్‌ మ్యూజిక్‌.. పారితోషికం కూడా వద్దన్నా: తమన్‌
పుష్ప-2 బ్యాక్‌గ్రౌండ్‌ మ్యూజిక్‌ విషయంలో సంగీత దర్శకుడు తమన్‌ మరోసారి స్పష్టత ఇచ్చారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. "పుష్ప-2 బ్యాక్‌గ్రౌండ్‌ మ్యూజిక్‌ చేస్తారా? అని ఆ చిత్ర నిర్మాతలు నాకు కాల్‌ చేశారు. నేను చేయడం కరెక్టేనా సర్‌? అని అడిగా. వాళ్లకు నాపై నమ్మకం ఉంది. ‘నాకు వీలైనంత వరకూ చేసిస్తా సర్‌’ అని చెప్పా. పారితోషికం కూడా వద్దన్నా. దేవి అవకాశాలు నేను తీసుకోను. దేవితో నాకు మంచి రిలేషన్‌ ఉంది’’ అని పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్