మన్యం జిల్లా పార్వతీపురంలో ఏనుగుల గుంపు బీభత్సం సృష్టించింది. అడవిలో నుంచి బయటకు వచ్చి రోడ్డుపైకి వచ్చిన ఈ గుంపు, చింతపండు లోడుతో వెళ్తున్న ఒక లారీపై దాడికి దిగింది. లారీ అద్దాలను ధ్వంసం చేసింది. దీంతో అక్కడున్న వాహనదారులు భయాందోళనకు గురై, వాహనాలను వదిలేసి పరారయ్యారు. అటవీశాఖ అధికారులు వెంటనే స్పందించి పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చేందుకు చర్యలు చేపట్టారు.