వక్ఫ్ సవరణ బిల్లు పార్లమెంటులో ఉభయ సభల ఆమోదం పొందినందుకు PM మోదీ చరిత్రాత్మక ఘట్టంగా అభివర్ణించారు. ఇది దేశంలో సరికొత్త యుగానికి నాంది అవుతుందని తెలిపారు. బిల్లుకు మద్దతు తెలిపిన ప్రజలు, చర్చల్లో పాల్గొన్న MPలకు కృతజ్ఞతలు తెలిపారు. వక్ఫ్ వ్యవస్థలో దశాబ్దాలుగా పారదర్శకత లోపించడంతో ముస్లింలు, ముఖ్యంగా మహిళలు, పేదలు తీవ్రంగా ఇబ్బంది పడ్డారని పేర్కొన్నారు. ఇకపై ఈ పరిస్థితి మారుతుందని మోదీ తెలిపారు.