AP: మంగళగిరి ప్రజల కోసం దాదాపు 26 సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నామని మంత్రి నారా లోకేశ్ అన్నారు. ఎన్టీఆర్ సంజీవని పేరుతో మంగళగిరి, తాడేపల్లిలో క్లినిక్‌లు ఏర్పాటు చేశామన్నారు. దుగ్గిరాలలో కూడా మొబైల్ క్లినిక్ పెట్టి ఉచిత చికిత్సతో పాటు మందులు అందిస్తున్నామన్నారు. నీటి సమస్య ఉంటే వాటర్ ట్యాంకర్ల ద్వారా నీరందిస్తున్నామన్నారు. నిరుపేదలకు తోపుడు బండ్లు, మహిళలకు కుట్టు మిషన్లు ఇచ్చి తోడ్పాటు అందిస్తున్నామన్నారు.