AP: గ్రామ, వార్డు సచివాలయ శాఖ 2 విడతలు ఆధార్ క్యాంపులు నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది. ఈ నెల 3 నుంచి 5 వరకు ఒకసారి, 8 నుంచి 11 వరకు రెండోసారి ఈ క్యాంపులు నిర్వహించనుంది. రాష్ట్రవ్యాప్తంగా 1,95,735 మంది చిన్నారులు ఆధార్ కార్డులు పొందలేదని అధికారులు గుర్తించారు. వారికి కొత్త ఆధార్ కార్డులు ఇవ్వనున్నారు. ఆధార్ కార్డు వివరాలు అప్‌డేట్ చేసుకోవాలనుకునే వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు.