తిరుమల ఘాట్ రోడ్డులో సంభవించిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతిా చెందారు. ఘాట్ రోడ్డుపై చివరి మలుపు వద్ద ద్విచక్ర వాహనం అదుపు తప్పడంతో దానిపై వెళ్తున్న ఇద్దరు కిందపడ్డారు. వారి మీద నుంచి వెనుక నుంచి వస్తున్న బస్సు వెళ్లడంతో వారు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ప్రమాదం కారణంగా ఘాట్ రోడ్డులో ట్రాఫిక్‌జామ్ అయింది.