అయ్యప్ప మాలలో ఉండి భార్యను చంపిన భర్త

53చూసినవారు
అయ్యప్ప మాలలో ఉండి భార్యను చంపిన భర్త
తెలంగాణలోని మేడ్చల్ జిల్లా మేడిపల్లి పీఎస్ పరిధిలో దారుణం చోటుచేసుకుంది. ప్రతాప సింగారం గ్రామంలో భార్య నిహారిక (35)ను భర్త శ్రీకర్ రెడ్డి బండ రాయితో తలపై కొట్టి చంపాడు. ఈ దారుణ ఘటన సోమవారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. అయితే, శ్రీకర్ రెడ్డి అయ్యప్ప మాలలో ఉండడం విశేషం. నిహారికకు తల్లిదండ్రులు ప్రతాప సింగారం గ్రామంలో ఓ ఇల్లు కొనిచ్చారు. ఆ ఇల్లు విషయంలో వీరిద్దరికీ పలుమార్లు ఘర్షణలు జరుగుతూ ఉండేవి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్