378 మెట్రిక్ టన్నుల రేషన్ బియ్యం మిస్సింగ్ కేసులో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఈ కేసులో నిందితులుగా పలువురిని సీఐడీ అధికారులు ఇప్పటికే అరెస్ట్ చేశారు. అయితే తాజాగా ఈ కేసులో మాజీ మంత్రి పేర్ని నానిని ఏ6 నిందితుడిగా చేర్చడంతో ఆయన ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. తనను అరెస్టు చేయకుండా ముందస్తు బెయిల్ ఇవ్వాలని కోరుతూ లంచ్‌మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. కాగా ఈ పిటిషన్‌పై మరికొద్ది సేపట్లో విచారణ జరిగే అవకాశం ఉంది.