AP: సినీ నటుడు, వైసీపీ నేత పోసాని కృష్ణమురళికి బెయిల్ మంజూరైంది. ఓబులవారిపల్లి పీఎస్ లో పోసానిపై నమోదైన కేసులో బెయిల్ లభించింది. కడప మొబైల్ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. పోసాని కస్టడీ పిటిషన్ ను కోర్టు కొట్టి వేసింది. అయితే, నరసరావుపేట, ఆదోని కోర్టుల్లోనూ బెయిల్ వస్తేనే పోసాని బయటకు వచ్చే అవకాశం ఉంటుంది.