విశాఖలో టీడీఆర్ బాండ్ల అక్రమాలపై విజిలెన్స్, సీఐడీ విచారణ జరుగుతోందని మంత్రి పొంగూరి నారాయణ తెలిపారు. వారి నుంచి నివేదిక రాగానే బాధ్యులపై చర్యలు తీసుకుంటామని శాసనసభ ప్రశ్నోత్తరాల సమయంలో ఆయన సభ్యుల ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. గత ప్రభుత్వంలో టీడీఆర్ బాండ్ల జారీలో భారీగా అవకతవకలు జరిగాయన్నారు. విశాఖలోనే కాదని తణుకు, తిరుపతిలో కూడా అక్రమాలు జరిగాయని తెలిపారు.