అమెరికాలోని కర్మాగారాల్లో పనిచేస్తున్న శ్రామిక మహిళలు సంఘటితం అయ్యారు. 1845లో 16 గంటల నుండి 10 గంటలకు పని తగ్గించాలని కోరుతూ సమ్మె నెల రోజులపాటు సాగింది. ఈ ఉద్యమాన్ని యాజమాన్యం అణిచి వేయాలని ప్రయత్నించింది. 1857 న్యూయార్క్ నగరంలో ఆకలితో చస్తూ బతికే కన్నా పోరాటంలో చావడం మేలని భావించి బట్టల మిల్లుల్లో పనిచేసే మహిళా కార్మికులు సమ్మె చేసి విజయాన్ని సాధించారు. దీని స్ఫూర్తితో అనేక దేశాలలో హక్కుల కోసం భారీ ర్యాలీలు జరిగాయి.