అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఒక ఈవెంట్ కాదు. ఒక పోరాట చిహ్నం. కార్మిక మహిళలు, విద్యావంతులైన చైతన్యవంతమైన మహిళలు తమలాగే బాధలు అనుభవిస్తున్న కార్మిక సోదరులతో కలసిసాగించిన పోరాట గాథల గానం. స్త్రీల ఐక్యత, పోరాడే మార్గంపై స్పష్టత, సృజనాత్మకంగా నూతన ఒరవడిలో రైతులను, కూలీలను సమస్త మహిళా కార్మికులను, గృహిణులను కలుపుకొని పోరాటాలకు అడుగులు కలపాలి. అందుకు వేదిక మార్చి 8.