1921 వరకూ రష్యాలో మినహ ఇతర దేశాలలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఫిబ్రవరి, మార్చి నెలల్లో ఏదో ఒక ఆదివారం నిర్వహించేవారు. మూడవ ఇంటర్నేషనల్ నిర్ణయంతో 1921 నుండి అన్ని దేశాలలో మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుకోవడం ప్రారంభమైంది. 1960, 70 దశకాలలో వచ్చిన స్త్రీవాద ఉద్యమం, 1975వ సంవత్సరంలో ఐక్యరాజ్యసమితి తీర్మానం ఫలితంగా అన్ని దేశాలలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని నిర్వహించసాగారు.