TG: తమ భూములను తాము కాపాడుకోవడానికి రైతులు ఏడాదిన్నరగా భూ పోరాటం నిర్వహించారు. పోలీసు కేసుల కారణంగా ఇల్లు, వాకిలి విడిచి తిండీతిప్పలు లేకుండా పోలీస్‌ష్టేషన్, అధికారుల చుట్టూ తిరిగారు. భూములను కాపాడుకోవడానికి హైకోర్టును ఆశ్రయించారు. న్యాయపోరాటం సాగించి.. చివరకు విజయం సాధించారు. ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పాటు నోటిఫికేషన్‌ను రద్దు చేస్తూ గురువారం కోర్టు స్టే విధించడంపై సంతోషం వ్యక్తంచేశారు.