తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి వరుస అవమానాలు ఎదురవుతున్నాయి. గతంలో కొందరు సీఎం రేవంత్ పేరు మర్చిపోయిన ఘటనలు చోటుచేసుకోగా.. తాజాగా సొంత పార్టీ ఎమ్మెల్యేనే సీఎం పేరు మర్చిపోవడం చర్చనీయాంశంగా మారింది. వైరా ఎమ్మెల్యే రాందాస్ నాయక్ ఒక సమావేశంలో మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి శ్రీనివాస్ రెడ్డి, తుమ్మల నాగేశ్వర రావు అంటూ తడబడ్డారు. తరువాత సీఎం రేవంత్ రెడ్డి అన్న అన్న వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.