AP: నైరుతి బంగాళాఖాతంలో బలపడిన అల్పపీడనం ఉపరితల ఆవర్తనంతో కొనసాగుతోందని APSDMA తెలిపింది. రానున్న 24 గంటల్లో ఉ. తమిళనాడు, ద.కోస్తా తీరం వైపు, ఆ తర్వాత ఉత్తరం దిశగా AP తీరం వెంబడి పయనిస్తుందని తెలిపింది. ఇవాళ శ్రీకాకుళం, VZM, అల్లూరి, విశాఖ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు, ఏలూరు, కృష్ణా, NTR, GNT, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, అన్నమయ్య, చిత్తూరు, TRPT జిల్లాల్లో మోస్తరు వర్షాలు పడతాయని తెలిపింది.