AP: కుల, స్థానికత, జనన ధ్రువపత్రాలపై జగన్, నవరత్నాల లోగోపై హైకోర్టు విచారించింది. దేశంలోని ఏ రాష్ట్రంలోనూ ధ్రువపత్రాలపై సీఎం బొమ్మ ముద్రించలేదన్నారు. వాటిపై కేవలం జాతీయ చిహ్నమే ముద్రించాల్సి ఉందన్నారు. ధ్రువపత్రాలపై జగన్ ఫోటోతో పాటు నవరత్నాల పథకం లోగోను తొలగించామని.. ప్రభుత్వం తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. బహుజన సోసైటీ అధ్యక్షుడు బాలకోటయ్య వేసిన పిటిషన్‌పై విచారణ ముగించినట్టు ధర్మాసనం తెలిపింది.