AP: ఏలూరు జిల్లా ఉంగుటూరు నియోజకవర్గం నిడమర్రు మండలం క్రొవ్విడిలో అశ్లీల నృత్యాలు కలకలం రేపాయి. జనసేన పార్టీ మండల అధ్యక్షుడు వాకమూడి ఇంద్ర జన్మదినం సందర్భంగా క్రొవ్విడి శివారు రైస్ మిల్లులో పార్టీ నిర్వహించారు. ఈ పుట్టినరోజు వేడుకల్లో రికార్డింగ్ డ్యాన్స్‌లు పెట్టినట్లు ఆలస్యంగా ఓ వీడియో వెలుగులోకి వచ్చింది.