ఏపీ, యానాంలో దిగువ ట్రోపో ఆవరణంలో వాయువ్యదిశగా గాలులు వీస్తున్నట్లు అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. నిన్న నైరుతి బంగాళాఖాతంలో కొనసాగున్న ఉపరితల ఆవర్తనం.. ఇవాళ నైరుతి, ఆగ్నేయ బంగాళాఖాతంలో కొనసాగుతున్నందున ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తా, సీమ జిల్లాల్లో నేటి నుంచి 3 రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అకాశం ఉందని తెలిపింది. కొన్నిచోట్ల ఉరుములతో కూడిన జల్లులు కురుస్తాయని చెప్పింది.