ఆఫ్రికాలో కొత్త వైరస్.. ఒక్క నెలలోనే 400 మంది మృత్యువాత

76చూసినవారు
ఆఫ్రికాలో కొత్త వైరస్.. ఒక్క నెలలోనే 400 మంది మృత్యువాత
ఆఫ్రికా దేశాల్లో ‘డిసీజ్ ఎక్స్‌’ దడ పుట్టిస్తోంది. ముఖ్యంగా డెమోక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలో దీని బారిన పడి ఒక్క డిసెంబర్‌ నెలలోనే 400 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. అక్కడి అధికారులు ఈ మరణాలకు కారణాన్ని కనుగొనే ప్రయత్నాల్లో ఉన్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) 2018లో ఒక మహమ్మారి వంటి ప్రపంచ ఆరోగ్య సంక్షోభానికి కారణమయ్యే తెలియని వ్యాధికారకాన్ని పేర్కొనేందుకు ‘డిసీజ్ ఎక్స్’ అనే పదాన్ని సూచించింది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్