TG: హైదరాబాద్ మీర్‌పేట్‌లో భార్యను ముక్కలుగా నరికిన ఘటనలో రోజుకో కొత్త కోణం వెలుగులోకి వస్తోంది. శవాన్ని ఎలా ముక్కలు చేసి, మాయం చేయాలి? అనే విషయాలను నిందితుడు గురుమూర్తి OTTలోని ఓ క్రైమ్ వెబ్‌సిరీస్‌లో చూసినట్లు విచారణలో తేలింది. ముక్కలను కరిగించడానికి అవసరమైన కెమికల్స్ కోసం యూట్యూబ్ వీడియోస్ చూశాడట. పొరుగింట్లోకి దుర్వాసన వెళ్లకుండా కొన్ని ద్రావణాలు వాడాడు. కాగా ఇవాళ పోలీసులు కేసు వివరాలు వెల్లడించే అవకాశముంది.