అల్లు అర్జున్ పర్యటన.. కానిస్టేబుళ్లపై వేటు

55చూసినవారు
అల్లు అర్జున్ పర్యటన.. కానిస్టేబుళ్లపై వేటు
నంద్యాలలో నటుడు అల్లు అర్జున్ పర్యటన వివాదంపై ఇద్దరు కానిస్టేబుళ్లపై వేటు పడింది. కానిస్టేబుళ్లు స్వామి నాయక్, నాగరాజు వీఆర్‌కు పంపిస్తూ ఆదేశాలు జారీ అయ్యాయి. ఈ నెల 11న త‌న సతీమణి స్నేహారెడ్డితో కలిసి వైసీపీ అభ్యర్థి శిల్పా రవిచంద్ర కిషోర్‌ రెడ్డి ఇంటికి అల్లు అర్జున్ వెళ్లారు. ఈ క్ర‌మంలో భారీ జన సమీకరణ జరుగుతుందని సమాచారాన్ని అందివ్వలేదని కానిస్టేబుళ్లపై చర్యలు తీసుకున్నారు.

సంబంధిత పోస్ట్