ఏపీలో పుష్ప-2 సినిమా టికెట్ల పెంపుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. దీంతో ప్రభుత్వానికి హీరో అల్లు అర్జున్ కృతజ్ఞతలు తెలిపారు. 'పుష్ప-2 టికెట్ రేట్లు పెంచినందుకు ఏపీ ప్రభుత్వానికి హృదయపూర్వక ధన్యవాదాలు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు. తెలుగు చలన చిత్ర పరిశ్రమను బలోపేతం చేయడంలో పవన్ అమూల్యమైన మద్దతుకు ధన్యవాదాలు' అని అల్లు అర్జున్ ట్వీట్ చేశారు.