గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థపై చంద్రబాబు సమీక్ష

55చూసినవారు
గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థపై చంద్రబాబు సమీక్ష
AP: గ్రామ, వార్డు సచివాలయాలపై నేడు ఉండవల్లి నివాసంలో సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. ఉద్యోగుల్లో కొందరికి ఎక్కువ పని, మరికొందరికి తక్కువ పని ఉండటం సరికాదని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. ప్రభుత్వ అవసరాలకు అనుగుణంగా ఉద్యోగుల సర్దుబాటు, శిక్షణ ఇవ్వాలని సూచించారు. 1.27 లక్షల మంది ఉద్యోగుల్లో యువత అధికంగా ఉన్నారని, వారిని ఏ విధంగా వినియోగించుకోవాలనే అంశంపై అధికారులతో చర్చించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్