ఫెంగల్ తుపాన్ కారణంగా తమిళనాడులో పెను విషాద ఘటన చోటుచేసుకుంది. తిరువణ్ణామలైలో కొండచరియలు విరిగి పడిన ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు మృతిచెందారు. రెస్క్యూ బృందం శ్రమించి ఇప్పటికి ఆరు మృతదేహాలను వెలికితీశారు. మరో మృతదేహం కోసం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. వీరిలో ఐదుగురు చిన్నారులు సైతం ఉన్నారు.