మంత్రి నాదెండ్ల నిజాలు తెలుసుకుని మాట్లాడాలి: అంబటి

71చూసినవారు
మంత్రి నాదెండ్ల నిజాలు తెలుసుకుని మాట్లాడాలి: అంబటి
కాకినాడలో పట్టుకున్న పీడీఎస్ బియ్యం మంత్రి పయ్యావుల కేశవ్‌ వియ్యంకుడిదేనని, మంత్రి నాదెండ్ల మనోహార్‌ నిజాలు తెలుసుకుని మాట్లాడాలని మాజీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. అక్రమాలను అడ్డుకోవడంలో కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు. చంద్రబాబు హయాంలోనే అక్రమాలు జరిగాయని, వైఎస్సార్‌సీపీపై బురద చల్లేందుకు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. పవన్‌, నాదెండ్ల మనోహర్‌ చేతకాని మాటలు మాట్లాడుతున్నారని పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్