అనకాపల్లి మండలం తిమ్మరాజుపేట గ్రామంలో శ్రీ కళ్యాణ వేంకటేశ్వరస్వామి ఆలయంలో శ్రీ సుదర్శన నృసింహయాగము బుధవారం వైభవంగా జరిగింది. ఉదయం స్వామివారి యాగశాలలో సింహాచలం అర్చకులు సుమంత్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో సుమారు 50 మంది దంపతులు పూజలో పాల్గొన్నారు. టీటీడీ విశాఖ జోన్ క్లస్టర్ ఎం. కాంతి కుమార్, హిందూ ధర్మ ప్రచార పరిషత్ సీహెచ్ సత్యనారాయణ నేతృత్వంలో కార్యక్రమం నిర్వహించారు.