రైతన్నకు అండగా వైఎస్సార్సీపీ ఆందోళనలో భాగంగా శుక్రవారం అనకాపల్లిలో ఆ పార్టీ నాయకులు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. అంతేకాకుండా జిల్లా కలెక్టర్ కు వినతిపత్రం అందించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు బూడి ముత్యాల నాయుడు, ప్రభుత్వ మాజీ విప్ కరణం ధర్మశ్రీ, పెందుర్తి మాజీ ఎమ్మెల్యే అదీప్ రాజు జిల్లా నాయకులు పాల్గొన్నారు.