భారత రాజ్యాంగం పౌరులందరికీ సమాన హక్కులు కల్పించిందని జిల్లా కలెక్టర్ విజయ క్రిష్ణన్ తెలిపారు. భారత రాజ్యాంగం అమలు లోనికి వచ్చిన నవంబరు 26 తేదీని పురస్కరించుకొని మంగళవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో భారత రాజ్యాంగ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముందుగా భారతరత్న డా. బాబాసాహెబ్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం రాజ్యాంగ ప్రతిజ్ఞ చేశారు.